
అయితే ఈ సినిమాలో నటించడం కోసం చాలామంది హీరోయిన్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది.హీరోయిన్ శ్రీలీల, మరొక హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమా కోసం గట్టి పోటీ జరుగుతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ సినిమా కోసం హీరోయిన్ శ్రీలీలకు వచ్చే అవకాశం ఉన్నదట. ఈ చిత్రం గురించి మరొక వాదన కూడా ఇప్పుడు వినిపిస్తున్నది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. అందుకే అటు హీరోయిన్ శ్రీలీల, అనన్య పాండే ఈ సినిమాలో నటించబోతున్నట్లు చర్చలు జరుగుతున్నాయట.
హీరో కోసం ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా పోటీపడే పాత్రలలో కనిపించబోతున్నారట.. ఇప్పటికే శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో ఆషికి 3 సినిమాలో నటించింది. మరి కొత్త సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఏ విధంగా అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి మరి. ఈ విషయం విన్న నెటిజన్స్ కియారా అద్వానీ భర్త కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య వార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.శ్రీలీల సినీ కెరియర్ విషయానికి వస్తే రవితేజతో మాస్ జాతర అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. ఆ తర్వాత తమిళంలో పరాశక్తి అనే సినిమాలో నటిస్తూ ఉండగా ఇటీవలే అక్కినేని అఖిలతో లెనిన్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు అఫీషియల్ గా తెలియజేశారు.