
వార్2 సినిమా కోసం రెండు ప్రముఖ బ్యానర్లు పోటీ పడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కూలీ సినిమా కూడా అదే సమయంలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వార్2 వర్సెస్ కూలీ సినిమాల పోటీ సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అవుతోంది. వార్2 సినిమాలో కథ, కథనం కొత్తగా ఉంటాయని ఎన్టీఆర్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.
వార్2 సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమా వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్2 సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవాని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. వార్2 సినిమాకు సంబంధించి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.
వార్2 సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మెమరబుల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో సైతం తారక్ ఈ సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. నందమూరి హీరోల్లో తారక్ రేంజ్ వేరు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ ఈ సినిమా కోసం అత్యంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.