యంగ్ ఇండియా స్కూల్స్ ప్రాజెక్టు మొత్తం రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో పాఠశాలల నిర్మాణానికే రూ.21 వేల కోట్లు, మిగతా ఉన్నత విద్యా సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటు చేసి రుణాలు సేకరించే ప్రణాళిక ఉందని చెప్పారు. అయితే ఈ రుణాలను ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ పరిధి నుంచి మినహాయించాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. విద్యారంగ ఖర్చును మానవ వనరుల అభివృద్ధిలో పెట్టుబడిగా పరిగణించాలని, సాధారణ ఖర్చుగా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మినహాయింపు ఇస్తే రాష్ట్రం సులభంగా నిధులు సమీకరించి ప్రాజెక్టును వేగవంతం చేయగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న విద్యారంగ దృష్టిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించే లక్ష్యాన్ని ప్రశంసించారు. ప్రత్యేక ప్రయోజన సంస్థ వివరాలు, ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి