నటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అనేక భాష సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంటుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ అందులో గీత గోవిందం సినిమా మాత్రం రష్మికకు ఎప్పుడు స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. 

ఇందులో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య సాగే ప్రేమ, గొడవలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమా సమయంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. చాలా కాలం నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్న ఈ జంట వారి రిలేషన్ ను బయట పెట్టడం లేదు. కానీ చాలా సందర్భాలలో వీరిద్దరూ దిగేటువంటి ఫోటోలు ఒకేలా ఉంటాయి. అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం రష్మిక సినిమాల పరంగా మంచి ఫామ్ కొనసాగిస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ హీరో నటించిన చిత్రం "కింగ్డమ్". ఇందులో విజయ్ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.

ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అంతే కాకుండా ఇందులో హీరో హీరోయిన్ మధ్య కొనసాగే ప్రేమకు చాలా ప్రాముఖ్యత ఉందని స్పష్టంగా తెలిసిపోయింది. మొదటి పాటలోనే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ లిప్ లాక్ సీన్ ను చూపించారు. దీంతో ఈ టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది. అయితే భాగ్యశ్రీ, విజయ్ లిప్ లాక్ సీన్ పైన నటి రష్మిక సీరియస్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్న కారణంగానే లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉండమని రష్మిక భాగ్యశ్రీ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా సిని వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: