
శ్రీనిధి శెట్టి అప్పుడెప్పుడో కేజీఎఫ్ సినిమాలో నటించింది. హిట్ కొట్టింది . ఆ తర్వాత బోలెడన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి . కానీ ఆమె ఏ ఒక్కదానికి సైన్ చేయలేదు. శ్రీనిధి శెట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు నాని సరసన హిట్ 3 సినిమాలో నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో శ్రీనిధి శెట్టి పేరు మరొకసారి మారుమ్రోగిపోతుంది . వచ్చిన ప్రతి సినిమాకి సైన్ చేయడం కాదు జనాలను ఎంటర్టైన్ చేసే కంటెంట్ ఉన్న సినిమాలకు సైన్ చేయడమే శ్రీనిధి టార్గెట్ అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
కాగా హిట్ త్రీ సినిమా చూసిన తర్వాత శ్రీనిధికి చాలా మంది స్టార్ డైరెక్టర్ లు మళ్ళీ కాల్ చేసి ఆఫర్స్ ఇవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఆమె ఒక బంగారం లాంటి ఆఫర్ ని పట్టేసినట్టు తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం గమనార్హం . సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ సినిమా కి కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ వచ్చాయి . అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి శ్రీనిధి కూడా చేరినట్లు తెలుస్తుంది . రష్మిక మందన్నా.. శ్రీ లీల .. జాన్వి కపూర్ వీళ్లంతా కామన్. డిఫరెంట్ గా ఉండే హీరోయిన్ కావాలి అంటూ సుకుమార్.. శ్రీనిధి పేరుని తెరపైకి తీసుకొచ్చారట . రామ్ చరణ్ ఓకే చేస్తే ఆమె అఫీషియల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రకటించేస్తారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!