
ఈ రోజున త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిష కి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా త్రిష 42 ఏళ్లు అయినప్పటికీ కూడా వివాహానికి దూరంగా ఉండటంతో పాటుగా పెళ్లి గురించి మాత్రం త్రిష అసలు ఎలాంటి విషయం చెప్పకపోవడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు.కానీ గతంలో మాత్రం త్రిష, వరుణ్ అనే ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా జరుపుకున్నది. 2015 జనవరి 23న ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గానే జరిగింది.
ఆ తర్వాత త్రిష, వరుణ్ ఇద్దరూ కూడా పలు రకాల ఈవెంట్లకు, పార్టీలకు కూడా పాల్గొనడం జరిగింది. అలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏమైందో తెలియదు కానీ కొద్ది రోజులకే వీరిద్దరి పెళ్లి ఆగిపోయిందనే విధంగా వార్తలు వినిపించాయి.ఆ సమయంలో త్రిష గురించి వినిపించిన వార్తల విషయానికి వస్తే వరుణ్ కుటుంబానికి నటీని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని బిజినెస్ నేపథ్యంలో ఉండే అమ్మాయిని చేసుకోవాలని కోరుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. త్రిష సినిమాలతో బిజీగా ఉండడం వల్లే పెళ్లి ఆగిపోయిందనే విధంగా మరికొన్ని రూమర్స్ వినిపించాయి. మరి త్రిష విషయంలో ఏది నిజం అనేది తెలియదు కానీ మొత్తానికి త్రిష పెళ్లి ఆగిపోవడం అభిమానులకు నిరాశని మిగిల్చింది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది.