టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమకు ఎంట్రి ఇచ్చింది. అనేక సినిమాలలో కీలకపాత్రలను పోషించిన ఈ చిన్నది ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుసగా సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు ఉన్నారు.

 అనసూయకు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అందమైన ఫోటోలను షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. ఇక అనసూయ ఎప్పుడు సినిమాలు, షోలలో బిజీగా ఉండడమే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లాంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటుంది. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది యాంకర్ అనసూయ. హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాలలో ఈ చిన్నది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ ఉంటుంది.

వివిధ పట్టణాలు, నగరాలలో కూడా అనసూయ ఓపెనింగ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు అనసూయ రానుంది. ఇదివరకే అనేకసార్లు ఓపెనింగ్ కార్యక్రమాలలో పాల్గొన్న అనసూయ ఇప్పుడు తాజాగా మరోసారి సిరిసిల్ల పట్టణానికి రావడానికి సిద్ధమైంది. సిరిసిల్ల పట్టణంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అనసూయ హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు రాబోతోంది. ఏడవ తేదీన అనసూయ సిరిసిల్లకు రావడానికి ఈ సిద్ధమైంది. ఈ విషయం తెలిసి అనసూయ అభిమానులు సంతోషపడుతున్నారు. ఈ భామ ఓపెనింగ్ కి చాలాసార్లు సిరిసిల్లకు వచ్చింది. దీంతో అనేకమంది అభిమానులు అనసూయని చూడడానికి విపరీతంగా తరలివచ్చారు. ఈసారి అనసూయ వస్తే ఏ విధంగా సందడి వాతావరణం నెలకొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: