మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే కాని ఒక్క హిట్టు కూడా రావ‌డం లేదు. ఇటీవ‌ల రాబిన్ హుడ్ టైటిల్‌తో నితిన్ న‌టించిన సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా ను మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఇక భీష్మ లాంటి సూప‌ర్ హిట్ నితిన్‌కు ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్ట‌ర్‌. శ్రీలీల హీరోయిన్‌. సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్ లో నితిన్ న‌టించిన సినిమా త‌మ్ముడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన త‌మ్ముడు సినిమా వ‌చ్చి 20 ఏళ్లు అవుతోంది.. ఇప్పుడు ప‌వ‌న్ వీరాభిమాని అయిన నితిన్ అదే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.


ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ న‌టిస్తుండ‌గా.. ప‌వ‌న్‌ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు మంచి బజ్ ని అందుకుంది కానీ రిలీజ్ లేట్ అవ్వ‌డంతో బ‌జ్ త‌గ్గింది. ఇప్పుడు మేక‌ర్స్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి స‌స్పెన్స్‌కు తెర‌దించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ పై ఇంట్రెస్టింగ్ ఫన్ వీడియోని దర్శకునిపై ప్లాన్ చేసి రిలీజ్ చేయడం ప్రమోషనల్ గా కూడా బాగుంది. సో నితిన్ అయితే ఈ జూలై 4న థియేటర్స్ లో పలకరించనున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: