సినీ ఫీల్డ్ లో ఏ హీరో, ఏ హీరోయిన్ మధ్య ఎప్పుడూ ఎలాంటి ప్రేమ పుడుతుందో తెలియదు. పుట్టిన ప్రేమ ఎంతకాలం నిలుస్తుందో అసలే చెప్పలేం. అలా సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి నటీనటుల మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసుకుని జీవితంలో సెట్ అయిన వారున్నారు. మరి కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయిన వారు కూడా ఉన్నారు.  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నటువంటి విజయ్ దేవరకొండకు మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు మధ్య లవ్ ఉందని చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. డీయర్ కామ్రేడ్, గీతాగోవిందం సినిమాల్లో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ పుట్టిందట. అప్పటినుంచి వీరిద్దరూ కలిసి తిరగడం వేకేషన్స్ వెళ్లడం ఇలా పండగలు జరిగితే ఒకరింటికి ఒకరు వెళ్లడం చేస్తూ వస్తున్నారు.

 అంతేకాదు వారికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వార్త వస్తుంది. అలాంటి ఈ తరుణంలో తాజాగా రష్మిక మందన విజయ్ దేవరకొండ విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీనికి కారణం కూడా రష్మిక మందన్న పెట్టిన పోస్ట్ అని తెలుస్తోంది. స్నేహితులను అంత తేలికగా నమ్మవద్దు. ఈనాడు స్నేహితులుగా భావించే వారే రేపు  కాకపోవచ్చు. మనం ఎప్పుడైనా నమ్మేది తల్లిదండ్రులను, వారు ఉన్నంతవరకు గౌరవించండి.

ప్రపంచంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది కూడా వారే. అందుకే వారు ఇచ్చే ఏ సూచన అయినా వినండి వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకోండి. తల్లిదండ్రులను ఎప్పుడు తేలికగా తీసుకోకండి అంటూ రష్మిక మందన పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ రష్మిక మందన విజయ్ దేవరకొండతో బ్రేకప్ చెప్పబోతుందని అంటున్నారు. దీనికి కారణం ఒక హీరోయిన్ అని, విజయ్ మరో హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడం వల్లే రష్మిక మందన హర్ట్ అయిపోయిందని అందుకే ఆమె బ్రేకప్ చెబుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: