తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసికల్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికీ ఎవరి గ్రీన్ సినిమాగా పేరు సంపాదించింది. చిరంజీవి నటన శ్రీదేవి అందం ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంతోమంది చైల్డ్ యాక్టర్స్ నటించారు. ఈ సినిమాతో శ్రీదేవి అతిలోకసుందరిగా పేరు సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ఈనెల తొమ్మిదవ తేదీన రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి బ్లాక్ లో కూడా టికెట్లు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని 3D,8K లో రిలీజ్ చేసేందుకు సైతం చిత్ర బృందం సిద్ధమయ్యింది. ఎందుకోసం ఏకంగా 8 కోట్ల రూపాయల ఖర్చు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఓల్డ్ చిత్రానికి 8K లో రిలీజ్ చేయడం అంటే అది చిరంజీవి చిత్రానికే దక్కిందని చెప్పవచ్చు అయితే త్రీడీలో ఈ సినిమా మరింత బ్యూటిఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అటు మెగాస్టార్ అభిమానులు శ్రీదేవి అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీ రిలీజ్ ల సినిమాల హవా కొనసాగుతూ ఉన్నది. దీనివల్ల అటు నిర్మాతలు కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టుకుంటున్నారు. మరి కొంతమంది ఇలా వచ్చిన డబ్బులను ఇతరత్రా సేవా కార్యక్రమాలకు కూడా వినియోగిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి అలాగే డైరెక్టర్ అనిల్ రావు పూడితో కూడా తన తదుపరి చిత్రాన్ని లైన్ లో పెట్టారు. ఈసారి అభిమానులను మరింత ఆకట్టుకునే విధంగా తన చిత్రాలను ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: