( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన ` సుప్రీమ్ ` చిత్రం విడుద‌లై నేటికి 9 ఏళ్లు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా న‌టించ‌గా.. మాస్టర్ మికైల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబీర్ సింగ్ దుహా, రవి కిషన్, సాయి కుమార్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.


2016 మే 5న విడుద‌లైన సుప్రీమ్ తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ఈ సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. 1987లో మెగాస్టార్ చిరంజీవి, ఎ. కోదండరామిరెడ్డి కాంబినేష‌న్ లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ ` పసివాడి ప్రాణం ` చిత్రాన్ని అటు తిప్పి.. ఇటు తిప్పి సుప్రీమ్ మూవీని తీసినట్టు ఉంటుంది. పసివాడి ప్రాణం మూవీకి సుప్రీమ్ కాపీ అన్న టాక్ కూడా అప్ప‌ట్లో వ‌చ్చింది. అయితే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్, సంగీతం సుప్రీమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.


రాజన్ పాత్రలో చిన్న‌పిల్లాడు మాస్టర్ మికైల్ కూడా అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన యముడికి మొగుడు సినిమాలోని అందం హిందూళం పాటని ఈ చిత్రంలో రీమిక్స్ మ‌రొక విశేషం. ఇక టాక్ అనుకూలంగా ఉండ‌టం, స‌మ్మ‌ర్ లో రిలీజ్ కావ‌డంతో అప్ప‌ట్లో సుప్రీమ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సుప్రీమ్‌.. ఫుల్ ర‌న్ లో రూ. 25.38 కోట్లు షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4 కోట్ల రేంజ్ లో లాభాల‌ను మిగిల్చి క్లీన్ హిట్ గా నిలిచింది.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: