సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణమైన విషయమే . మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు - హీరోయిన్లు .. డైరెక్టర్లు - హీరోయిన్లు .. ప్రొడ్యూసర్లు - హీరోయిన్లు ఇలా చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ కూతుర్లు - డైరెక్టర్లు ..ప్రొడ్యూసర్ కూతుర్లు - హీరోలు.. డైరెక్టర్ - ప్రొడ్యూసర్స్ కూతుర్లు ఇలా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యారు.  అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో హ్యాపీగా ఉన్నారా..? అంటే నో అని చెప్పాలి . కొంతమంది పెళ్లి అన్న బంధాన్ని చాలా అవహేళనగా చేస్తూ టైంపాస్ గా మార్చేస్తూ .. బాండింగ్ కుదరకపోతే విడాకులు తీసుకుంటున్నారు.


మరి కొంతమంది మాత్రం చేసిన తప్పులను సరిదిద్దుకొని భార్యాభర్తలుగా కంటిన్యూ అవుతున్నారు.  అయితే స్టార్ హీరోస్ ని  పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ లైఫ్ ఫుల్ రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది అని కంట్రోల్ గా ఉండాలి అని హీరోయిన్ల కెరియర్ వదులుకుంటేనే  హీరోలను పెళ్లి చేసుకోవాలి అన్న విషయాలు జనాలు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు . మరి ముఖ్యంగా లావణ్య త్రిపాఠి మెగా హీరోని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె లైఫ్ ఎలా మారిపోయింది ..హీరోయిన్ శోభిత - నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె లైఫ్ ఎలా మారిపోయింది అన్న విషయాలు అందరికీ తెలుసు.



కేవలం వీళ్లిద్దరే కాదు చాలామంది హీరోయిన్స్ దీనికి బిగ్ ఎగ్జాంపుల్  గా చెప్తూ ఉంటారు.  అయితే ఇవన్నీ తెలిసి కూడా మరొక క్రేజీ  హీరోయిన్ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది . ఎస్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఆమె మరి ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రష్మిక - విజయ్ దేవరకొండతో ప్రేమాయణం కొనసాగిస్తుంది అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి . అయితే త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ కుటుంబ సభ్యుల వీళ్ళ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట . పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అన్నది పూర్తిగా వీళ్ల పైన వదిలేసారట . కాగా రష్మిక - విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఈ సంవత్సరంలో ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చే సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట.  అదే నిజమైతే మాత్రం లావణ్య త్రిపాఠి - శోభిత ల తర్వాత ఒక హీరోని పెళ్లి చేసుకున్న హీరోయిన్గా రష్మిక క్రేజీ రికార్డ్ కొట్టేసినట్లే అని చెప్పుకోవాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: