టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపులో ఏర్పరచుకున్న నటనలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను ప్రారంభించిన తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత ఈయన సినిమాలలో హీరో గా అవకాశాలను దక్కించుకొని ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన కొంత కాలం క్రితం శ్వాగ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయింది.

స్వాగ్ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీ విష్ణు తాజాగా సింగిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మే 9 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కేవలం 2 గంటల 05 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ అత్యంత తక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా చాలా తక్కువ నడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియడంతో ఈ సినిమా కనుక కాస్త బోర్ కొట్టకుండా ముందుకు వెళ్లిన మంచి టాక్ ని తెచ్చుకోవడం ఖాయం అని , అలాగే మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ కి భారీ ఎత్తున కలెక్షన్లు కూడా వస్తాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి సింగిల్ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv