ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో ఒక కొత్త సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. ఇటీవలే రిలీజ్ అయిన జాక్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో హీరోగా స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించారు. ఈ సినిమాకు బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించారు.  జాక్ సినిమాకు  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది.

సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచుతుందని సమాచారం వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మూవీ బోల్తా కొట్టింది. ముఖ్యంగా జాక్ సినిమా యువతకు చాలా నచ్చుతుందని టాక్ వినిపించినప్పటికీ ఫ్లాప్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని దర్శకుడు భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు కానీ అది నెరవేరలేదు. అయితే ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్  కి రానుంది. ఈ మూవీ తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా అందుబాటులోకి రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: