
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయ్యాక అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తారు. ఈ సినిమా ను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాలో నయనతాను మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే సెలక్ట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఓ ఎమ్మెల్యేను తీసుకున్నారు. ఎమ్మెల్యే అంటే ఆమె నిజంగా ఎమ్మెల్యే కాదండోయ్ .. యుఆర్ మై ఎమ్మెల్యే అంటూ అల్లు అర్జున్ ను సరైనోడు సినిమాలో ఆట పట్టించింది కేథరిన్ థెస్రా. పూరి జగన్నాథ్ సినిమా లో కురచ స్కర్ట్ లు వేసుకుని కుర్రకారుకు మాంచి కిక్ ఇచ్చింది కేథరిన్.
ఈ సినిమా లో రెండో హీరోయిన్ పాత్ర కు కాస్త గ్లామర్ టచ్ .. డోస్ బాగా ఉంటాయట. ఇలాంటి పాత్రలకు సరైన హీరోయిన్ల ను సెటప్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి ది అందెవేసిన చేయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేయడం ఏంట్రా ? అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా కు ఆమే చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు మెగాస్టార్ తో క్లాస్ పాటలకు నయనతార .. మాస్ పాటలకు కేథరిన్ బాగా షూట్ అవుతారని అందరూ అంటున్నారు. ఏదేమైనా ఈ కాంబినేషన్ కు హీరోయిన్లు బాగా సెట్ అయ్యారనే టాక్ వస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు