
ఈ సినిమాకు నయనతార ఏకంగా 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్ నయన్ పారితోషికం 12 కోట్ల రూపాయల స్థాయిలో ఉంది. తన రెమ్యునరేషన్ కంటే ఏకంగా 6 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయడం ఒకింత సంచలనం అవుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లకు సైతం పెద్ద పీట వేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ కేథరిన్ కనిపించనున్నారని భోగట్టా. కేథరిన్ కు ఒక విధంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. క్లాస్ సాంగ్స్ కోసం నయనతారను మాస్ సాంగ్స్ కోసం కేథరిన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
చిరంజీవి లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. చిరంజీవి సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు.