తాజాగా మెగా కుటుంబ సభ్యుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. టాలీవుడ్ లో మెగా బ్రదర్ గా పేరు పొందిన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ప్రేమించి వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. గత కొద్దిరోజులుగా ఈ విషయం పైన వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు ఈ జంట. తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామంటూ ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ రాసుకొచ్చారు.


దీంతో ఈ జంటకు అభిమానులు  శుభాకాంక్షలు తెలియజేస్తూ వైరల్ గా చేస్తూ ఉన్నారు. సినీ తారలు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నేళ్లపాటు ప్రేమించుకొని మరి పెద్దలను ఒప్పించి 2023లో వీరి వివాహ చేసుకున్నారు 2017లో మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి వీరిద్దరు కలుసుకోవడంతో ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ ఏర్పడిందట. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత అంతరిక్షం అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.


అటు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు. రహస్యంగానే ఉంచారు. 2023 నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం జరిగింది. వివాహం తర్వాత వరుణ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నది. అయితే గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్ సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: