
హాలీవుడ్ లో అత్యంత పాపులర్ ఫ్యాషన్ షో ` మెట గాలా ` ఈసారి న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మరింత సందడిగా సాగింది. ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకలో హాలీవుడ్ తారలతో పాటు మన ఇండియన్ సెలబ్రిటీలు కూడా విభిన్నమైన గెటప్స్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. ఇండియా తరఫున బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తొలిసారి ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించిన బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో ఆయన మెరిశారు. లేయర్డ్ నెక్లెస్‌లు, కళ్లకు గాగుల్స్, వాచ్ మరియు చేతిలో వాకింగ్ స్టిక్ తో డిఫరెంట్ గా షారుక్ కనిపించారు. అయితే మెట్ గాలాలో షారుక్ ఖాన్ తన చేతికి ధరించిన వాచ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ` పటేక్ ఫిలిప్ ` కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్ ను షారుక్ ధరించారు. ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో ఆ వాచ్ ధరెంతో తెలుసుకునేందుకు నెటిజన్లు ఉత్సాహం చూపుతున్నారు.
పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ 6300G మోడల్ వాచ్ తో షారుక్ మెట్ గాలాలో మెరిశాడు. స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ వాచీ తయారీ సమస్థ దీన్ని తయారు చేసింది. ఈ వాచ్ ధర 2.5 మినియన్ల డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 21 కోట్లు. ఈ విషయం తెలిసి షాక్ అవ్వడం నెటిజన్ల వంతు అయింది. షారుక్ ఖాన్ వాచ్ ధరతో ఓ చిన్న సినిమానే తీయొచ్చని చాలా మంది మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు