
తాజాగా అనుష్క చేయాల్సిన ఒక లేడీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను సాయి పల్లవి కొట్టేసింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్గా సాయి పల్లవి ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే . కానీ సాయి పల్లవి లేడీ ఓరియంట్ ఫిలిం అంటే అస్సలు వెనకాడదు . హీరోయిన్గా పూర్తిగా బిజీగా ఉన్న మూమెంట్ లోనే "గార్గి" అనే డిఫరెంట్ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం చేసింది . 2022లో విడుదలైన ఈ సినిమా సాయి పల్లవి నటనకి మంచి మార్కులు దక్కేలా చేసింది. అయితే అప్పటినుంచి సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి సైన్ చేయలేదు .
కాగా రీసెంట్గా ఓ మూవీకి సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నవీన్ నార్ని . వై..రవిశంకర్ ఒక కథ విన్నారు అని.. ఓ సీనియర్ రచయిత రాసిన ఈ పవర్ ఫుల్ స్టోరీలో సాయి పల్లవి అయితే బాగా నటిస్తుంది అంటూ స్పెషల్ గా ఆమె అపాయింట్ మెంట్ తీసుకుని మరి ఈ స్టోరీని వివరించారట. ఆమె కూడా కథ విని ఇంప్రెస్ అయిపోయిందట. అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసేసిందట. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణంతో బిజీగా ఉంది సాయి పల్లవి . అలాగే ఈ సినిమాకి కూడా సైన్ చేసిందట. నిజానికి ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ అనుష్క అయితే బాగుంటుందని అంతా అనుకున్నారట . కానీ అనుష్కకి ఇప్పుడు అంత క్రేజ్ లేదు అని అనుష్క కాకుండా ఇప్పుడు క్రేజ్ లో ఉన్న హీరోయిన్ సాయి పల్లవి తో ఈ మూవీ చేయిస్తే వేరే లెవెల్ రెస్పాన్స్ వస్తుంది అంటూ మేకర్స్ భావించి అనుష్క చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ ని సాయి పల్లవికి ఇచ్చేసారట..