అక్కినేని కోడలు శోభిత గురించి ప్రేక్షకులకు కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ మధ్య కాలంలో శోభిత గర్భవతి అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గాసిప్స్ మరీ ఎక్కువైన నేపథ్యంలో అక్కినేని కోడలు శోభిత ఈ వార్తల గురించి తన టీం ద్వారా క్లారిటీ ఇప్పించే ప్రయత్నం అయితే చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
లావణ్య త్రిపాఠి గర్భం దాల్చినట్లు అధికారిక ప్రకటన వచ్చిన నేపథ్యంలో శోభిత నుంచి కూడా ఆ మేరకు ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అయితే శోభిత టీం మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని మాతృత్వం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
 
బాలీవుడ్ మీడియాలో వైరల్ అయిన కథనాల గురించి ఆమె ఈ విధంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కినేని కోడలు క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. శోభిత కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. శోభిత చైతన్య జీవితంలోకి వచ్చిన తర్వాత చైతన్యకు తండేల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. తండేల్ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
 
అక్కినేని శోభిత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. శోభితపై వచ్చిన పుకార్లు ఆగిపోవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. చైతన్య, శోభిత కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. శోభిత అక్కినేని ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. శోభిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: