మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఉన్న సమయంలో తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. అందచందాలతో ప్రేక్షకులను మైమరిపించింది. వివాహం తర్వాత ఈ అమ్మడు తన అభిమానులకు నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. వివాహం తర్వాత ఇప్పటివరకు లావణ్య త్రిపాఠి ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. తన పూర్తి సమయాన్ని ఇంటికే కేటాయిస్తోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహము గత సంవత్సరం ఆగస్టు నెలలో జరిగింది. 


వీరి వివాహం జరిగి సంవత్సరానికి పైనే అవుతున్న ఈ భామ ఇంతవరకు ఎలాంటి సినిమాలలో నటించలేదు. కనీసం సిరీస్ లు కూడా చేయడం లేదు. దీంతో తన అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ దంపతులు వారి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ తల్లిదండ్రులు అవుతున్నామని అనౌన్స్ చేశారు. ఈ పోస్ట్ చూసిన లావణ్య అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

మెగా కుటుంబం మొత్తం లావణ్య త్రిపాఠిని అపురూపంగా చూసుకుంటున్నారట. మా ఇంటికి వారసుడు, వారసురాలు రాబోతున్నారని సంతోషంలో వేడుకలు జరుపుకుంటున్నారట. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠికి మెగా కుటుంబ సభ్యులు ఓ కండిషన్ పెట్టారట. తాను ఇకనుంచి ఎలాంటి పనులు చేయొద్దని చెబుతున్నారట. అంతే కాకుండా సినిమా వ్యవహారాలను పూర్తిగా మానేయాలని అంటున్నారట. ఇకనుంచి సినిమాల మీద ఎలాంటి ఆలోచన రాకూడదని కండిషన్ పెట్టారట. పూర్తిగా రెస్ట్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారట.

ప్రెగ్నెంట్ అయిన కారణంగా లావణ్యను మెగా కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలని కండిషన్లు పెడుతున్నారట. కానీ లావణ్య త్రిపాటి మాత్రం ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఏదో ఒక పని చేస్తేనే చాలా యాక్టివ్ గా ఉంటామని చెబుతుందట. అయినప్పటికీ వారు వినకుండా లావణ్యకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారట. ఏది ఏమైనప్పటికి లావణ్య త్రిపాఠి ఆరోగ్యంగా ఉండే బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసి లావణ్య త్రిపాఠి అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: