
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిందే. నిజం చెప్పాలంటే బాలకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి బలమైన పునాది వేసిన సినిమా ఆఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టేసింది. మరి ముఖ్యంగా కరోనా తర్వాత తక్కువ టిక్కెట్ రేట్లతో అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన విధ్వంసం అలాంటిది ఇలాంటిది కాదు అని చెప్పాలి. అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక బాలయ్యకు పట్టిందల్లా బంగారం అయింది. వరుసగా అఖండ - వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి - డాకు మహారాజ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖండ టు తాండవం పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికి కుంభమేళాలో సైతం దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను షూటింగ్ చేసి కావాల్సినంత బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖండలో నటించిన బాలయ్య మనవరాలు పాత్రకు కంటిన్యూగా మరో అమ్మాయిని తీసుకోబోతున్నారట. ఆ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయ కుమార్తె శ్లోకను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో బాలకృష్ణ లయ కూడా విజయేంద్ర వర్మ సినిమాలో కలిసి జంటగా నటించారు. ఇప్పుడు లయ కుమార్తె శ్లోక బాలయ్యకు అఖండ టు సినిమాలో మనవరాలుగా నటిస్తుండటం విశేషం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.