ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా ఈమె నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం శుభం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతకోట్ల బడ్జెట్తో తొలిప్రేయంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజే థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పైగా మొదటి రోజు రూ.1.5 కోట్లు రాబట్టినట్లు సంతోషం వ్యక్తం చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక దీనిని బట్టి చూస్తే నిర్మాతగా సమంత మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యింది అనడంలో సందేహం లేదు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర కామెంట్లు చేసింది. "నేను నా లైఫ్ లో సక్సెస్ అయినప్పుడు కంటే ఫెయిల్యూర్ గా నిలిచినప్పుడే ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను.  నా కెరియర్ మొదట్లో వరుస సినిమాలు హిట్ అయినప్పుడు సంతోషించాను.  కానీ వాటి తర్వాత మళ్లీ ఫెయిల్యూర్స్ వచ్చాయి. అప్పుడే నా కెరియర్ లో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. అవే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. త్వరలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను."

"ఇక్కడి వరకు అంతానే బాగుంది. అయితే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయాలని అనుకోవట్లేదు. ఊ అంటావా మావా పాట నాకు ఒక సవాల్ లాంటిది. అనుకోకుండా వచ్చిన ఆఫర్ ని నేను సవాల్గా తీసుకొని చేశాను. కానీ అలాంటి వాటిపై నాకు ఆసక్తి లేదు. మంచి కథలు, పాత్రలు వస్తే చేయాలని ఉంది" అంటూ దర్శక నిర్మాతలకు తాను అనుకుంటున్న పాత్రల గురించి చెప్పి హింట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి సమంత కోరుకున్న పాత్రలు సమంతాకు వరించాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మరొకవైపు సమంత,  నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎంతో స్ట్రగుల్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాటన్నిటికీ దూరంగా సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: