టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు తాజాగా సింగిల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు నుండే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ గురించి పెద్ద ఎత్తైన ప్రమోషన్లు చేయడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ మే 9 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి.

ఆ తర్వాత కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలియజేస్తూ ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రకారం మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 16.30 కోట్లకు మించిన కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మూవీ కి భారీ కలెక్షన్లు దక్కుతాయి అని చాలా మంది భావిస్తున్నారు. మరి మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో ... ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv