తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అలనాటి అందాల తార సదా ఒకరిని చెప్పవచ్చు. ఈ భామ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను కట్టి పడేసింది. ఒకానొక సమయంలో సదా అంటే యూత్ విపరీతంగా ఇష్టపడేవారు. ముఖ్యంగా కుర్రాళ్ళు సదాకు వీరాభిమానులు. ఈ భామ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. 

తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి అనేక భాషా సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. సదా వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. సినిమాలలో రాణిస్తున్న సమయంలో అనేకమంది హీరోలతో ఎఫైర్ కొనసాగించినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అందులో సదా ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. కానీ ఓ తమిళ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిందట. అంతేకాకుండా ఆ హీరోతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందట.

ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. కానీ ఏమైందో తెలియదు మళ్ళీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం సదా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. కాగా... సదా ఇప్పటికీ సినిమాలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంటుంది. తెలుగు, తమిళ్, కన్నడలో అనేక సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ గుర్తింపు అందుకుంటుంది. సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: