
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు ఏయం జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ సినిమా హరిహర వీరమల్లు. మోఘల్ సామ్రాజ్యాన్ని దోచుకునే బందిపోటు దొంగగా పవన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడింది. ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాకు పవన్ సరిగా డేట్లు ఇవ్వక పోవడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్ గా షూట్ అయ్యాక సినిమా రిలీజ్ కి మళ్ళీ బ్రేక్ పడింది. ఇప్పుడు సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది ? అని ఉత్కంఠతో ఉన్నారు.
పవన్ సైతం ఈ విషయంలో అభిమానులకు ఒక చిన్న క్లారిటీ ఇస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండమని చెప్పాలి. ఈ సినిమా పూర్తయ్యాక ఇదే యేడాది పవన్ నటిస్తోన్న మరో సినిమా ఓజీ కూడా థియేటర్ల లోకి రానుంది. ఈ రెండు సినిమా లు పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ నటించే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు