నందమూరి ఫ్యామిలీ అంటే ఎంత పాజిటివ్ గా స్పందిస్తారో... అంతే రెస్పెక్ట్ కూడా ఇస్తూ ఉంటారు జనాలు . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి ఒక చెరగని ఇమేజ్ ని నందమూరి ఫ్యామిలీకి తెచ్చిపెట్టారు . ఆ ఇమేజ్ ని బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లు అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే వీళ్ళిద్దరికీ పడదు అని వీరిద్దరి మధ్య ఇన్నర్ వార్ జరుగుతుంది అని ఆ కారణంగానే తారక్ - బాలయ్య కలిసి ఏ సినిమాలో నటించలేదు అంటూ జనాలు ఇన్నాళ్లు మాట్లాడుకుంటూ వచ్చారు . ఈ మధ్యకాలంలో కూడా బాలయ్య - ఎన్టీఆర్ కి సంబంధించిన వార్ ఎక్కువగా జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.


అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలయ్య ..నందమూరి హీరో తారక్ ఒకే సినిమాలో నటించబోతున్నారట.  అయితే వీరిద్దరూ మల్టీస్టారర్ మూవీలో లా కలిసి నటించడం లేదు అని..బాలయ్య ఓకే చేసిన సినిమాలో  స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించడానికి తారక్ ఓకే చేశాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది. ప్రసెంట్ అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య . ఈ సినిమా అయిపోగానే క్రిష్ తో ఒక  సినిమాకి ..హరిష్ శంకర్ తో ఒక సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



కాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మోక్షజ్ఞ కూడా కనిపించబోతున్నాడు అంటూ టాక్ వినిపించింది . అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ లో తారక్ ని దింపే  ప్రయత్నం చేస్తున్నారట.  అయితే బాలయ్య - మోక్షజ్ఞ లైఫ్ కోసం ఒక స్టెప్ డౌన్ దిగి హీరో జూనియర్ ఎన్టీఆర్ ని ఈ క్యారెక్టర్ లో నటించడానికి   ఓకే చేశారట . నందమూరి ఫ్యాన్స్ ఫ్యామిలీతో విభేదాలు తొలగి కలవాలి అని వెయిట్ చేస్తున్నారు . దానికి ఇదే సరైన మూమెంట్ కావడంతో చెప్పిన క్యారెక్టర్ని ఓకే చేసేసారట తారక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతుందట . ఇది నిజంగా నందమూరి ఫ్యాన్స్ మీసం మెలివేసే న్యూస్  అంటున్నారు అభిమానులు.  ఇద్దరు స్టార్ హీరోస్ పైగా బాలయ్య కొడుకు ఒకే సినిమాలో నటిస్తే ఇక రచ్చ రచ్చే అనే అంటూ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: