- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ కింగ్డమ్ .. అయితే ఈ సినిమా నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ మరింత హైప్ ని పెంచుకుంటూ పోతుంది .  ఈ సినిమా యూనిట్ ఈనెల 30 న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు .  అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ డేట్ కి రాకపోవచ్చు అని టాక్ కూడా గట్టి గా వినిపిస్తుంది .. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ రూమర్స్ పై అధికారిక క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చేసింది .  తాజా గా వచ్చిన అప్డేట్ ప్రకారం కింగ్డమ్ జులై 4 న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు .  

అయితే ప్రస్తుతం మన దేశం లో నెలకొన్న పరిస్థితులు రీత్యా ఆ డేట్ కి మూవీని వాయిదా వేస్తున్నామ ని లేదంటే మే 30నే మూవీని విడుదల చేసేందు కు తాము కట్టుబడి ఉన్నామ ని కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల ప్రభావంం రీత్యా విడుదల తేదీ ని మార్చాల్సి వచ్చింద ని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది .. సో మొత్తాని కి కింగ్డంగ్ మూవీ రాక పాన్ ఇండియా లెవ‌ల్‌ లో జులై 4 న ఉండబోతుంది . ఇక ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తుండ గా సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చునర్ సినిమాస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకం గా ఈ సినిమా ను నిర్మించారు .. అలాగే ఈ సినిమా పై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .. ఇక మరి జూలై 4 న బాక్సాఫీస్ దగ్గర విజయ్‌ కింగ్డమ్ ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి ..


మరింత సమాచారం తెలుసుకోండి: