ఏంటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలో ఉన్న సీన్ చెత్త సీన్ అని స్వయంగా వివి వినాయక్ చెప్పారా..ఇంతకీ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాలో సీన్ చెత్త సీన్ అని వివి వినాయక్ అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో నటించారు.మొదటిది ఆది, రెండోది సాంబ.. అయితే ఆది మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టినప్పటికీ ఎన్నో అంచనాలతో వచ్చిన సాంబ మూవీ మాత్రం అంత హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని చిత్రీకరించినందుకు ఆ సీన్ ని ఎందుకు తీసానా అంటూ వివి వినాయక్ తెగ బాధపడిపోయారట. మరి ఇంతకీ ఆ సీన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. 

ఎన్టీఆర్ భూమిక, జెనీలియా కాంబోలో వచ్చిన సాంబ మూవీలోని ఓ సన్నివేశం గురించి వివి వినాయక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు నచ్చకుండానే ఓ సీన్ పెట్టాను.అయితే ఆ సీన్ చిత్రీకరించాక దాన్ని సినిమా నుండి తీసివేయాలి అనుకున్నాను. కానీ సినిమా నుండి ఆ సీన్ తీసేస్తే షూటింగ్ ఆగిపోతుంది అని అన్నారు.దాంతో చేసేదేమీ లేక మళ్లీ ఆ సన్నివేశాన్ని అందులోనే ఉంచేసాము. కానీ ఆ సీన్ ఇప్పుడు చూసినా కూడా ఎందుకు ఆ సీన్ ని పెట్టానా అని తెగ ఫీల్ అయిపోతుంటాను.

అంతేకాదు అది ఒక చెత్త సీన్ అంటూ వివి వినాయక్ చెప్పారు. అయితే ఆ సీన్ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు.కానీ ఈయన మాటలు విన్న చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలో సొంత అన్న భార్యను రేప్ చేసే ఒక సీన్ ఉంటుంది. బహుశా ఈ సన్నివేశాన్ని ఎందుకు తీసానా..అది ఒక చెత్త సీన్ అని వివి వినాయక్ అనుకున్నారు కావచ్చు అని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే సాంబ సినిమాలోని ఈ సన్నివేశం చూసి చాలా మంది నెటిజన్స్ విమర్శలు చేశారు. అసలు ఇదీ ఒక సీనేనా..డైరెక్టర్ ఈ సీన్ ని ఎందుకు పెట్టారు అని చాలామంది తిట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: