
సినిమా ప్రారంభంలోనే సరదాగా ఫ్రెండ్స్ తో చట్టాపట్టాలేసుకొని తిరిగే యువకుడిగా చిరంజీవి కనిపిస్తారు. ఆ తర్వాత అవినీతిని లంచగొండితనాన్ని ఎదిరించి చేస్తూ ఉండడంతో జైలు పాలవుతాడు ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చి విలన్లను దండించే రక్షకుడిగా నటించారు చిరంజీవి. ముఖ్యంగా డాన్సులు ఫైట్స్ రెండిటిలో కూడా చిరంజీవికి సాటి రారని నిరూపించుకున్నారు. డైరెక్టర్ క్రాంతి కుమార్ కూడా ఈ రెండిటిని చాలా ఉపయోగించే ఈ సినిమాని తీశారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైటింగ్ కూడా జలపాతాల దగ్గర చాలా అద్భుతంగా తీశారు.
ఇందులో హీరోయిన్ గా నటించిన సుమలత కూడా చిరంజీవికి దిటుగానే డాన్స్ లతో వేస్తు రొమాంటిక్ పాటలలో కూడా కసి కసిగా నటించింది. అయితే ఎక్స్పోజింగ్ విషయంలో ఇతర హీరోయిన్ల కంటే సుమలత వెనక లోనే ఉండేది. కానీ ఈ చిత్రంలోని వాన పాటల ఎక్స్పోజింగ్ లో కుమ్మేసింది సుమలత. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు."ముఖ్యంగా చీకటి పడితే సీతారాం డ్యూయెట్లో చాలా రొమాంటిక్ గా నటించింది సుమలత. చీకటి పడితే సీతారాం.. రాత్రికి వస్తే రాధే శ్యామ్ అని రొమాంటిక్ పాట ఇప్పుడే అయితే వివాదంగా మారేది. ముఖ్యంగా సీతారాం అనే వ్యాఖ్యను రొమాంటిక్ డ్యూయెట్లో ఉపయోగిస్తారా అంటూ చాలామంది ఫైర్ అయ్యేవారు.
అలాగే చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య.. రూంబా రుంబా హూ అంటూ సాగే పాట అద్భుతంగా ఉంది .ముఖ్యంగా చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య డ్యాన్స్ వార్ జరిగినట్టుగా కనిపిస్తోంది. అలాగే నటుడు రావు గోపాల్ రావు డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో కొన్ని తెలుగు పదాలకు ఇంగ్లీష్ పదాలను జోడించి మరి చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.. ఇందులో కీలకమైన పాత్రలో ఉదయ్ కుమార్, నూతన ప్రసాద్, సుత్తి జంట, రాళ్లపల్లి, శరత్ బాబు వంటి వారు నటించారు. చిరంజీవి అభిమానులు అయితే ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే.