ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పేరు తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ నిఘా సంస్థలకు ఈమె భారత్ కు సంబంధించిన సన్నితమైన సమాచారాన్ని చేరవేస్తోందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేయడం జరిగింది.
 
అయితే ఈమెకు పూరీకి చెందిన మరో యూట్యూబర్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హర్యానాలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన జ్యోతి మల్హోత్రా గతేడాది సెప్టెంబర్ లో పూరీని సందర్శించడంతో పాటు మరో యూట్యూబర్ ను కలిసినట్టు తెలుస్తోంది. పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
 
పూరీకి చెందిన ఆ యూట్యూబర్ పాకిస్తాన్ లోని గురుద్వారాను సందర్శించినట్టు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రాకు సంబంధించి వాస్తవాలు ఏంటనేది వెరిఫై చేస్తున్నామని ఈ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానా పోలీసులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పూరీకి చెందిన యూట్యూబర్ వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు.
 
యూట్యూబర్ తండ్రి మాట్లాడుతూ ఇద్దరూ యూట్యూబర్స్ కాబట్టి నా కూతురుకు జ్యోతి మల్హోత్రాకు పరిచయం ఏర్పడిందని వాళ్ల మధ్య స్నేహం పెరగడం వల్లే జ్యోతి మల్హోత్రా పూరీని సందర్శించిందని యూట్యూబర్ తండ్రి అన్నారు. జ్యోతి మల్హోత్రాపై ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదని ఆమె గూఢచర్యం చేస్తుందని తెలిస్తే ఆమెతో కాంటాక్ట్ లో కూడా ఉండేదానిని కాదని ఆమె అన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: