టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ ముందువరసలో ఉంటారు. ఈతరం హీరోలలో పౌరాణిక పాత్రలలో నటించే ప్రతిభ తారక్ కు మాత్రమే సొంతమని కామెంట్లు వ్యకమవుతున్నాయి. తారక్ ఈ పాత్రలలో అద్భుతమైన అభినయంతో సత్తా చాటుతున్నారు. ఈ జానర్ సినిమాలకు సరిపోయే హీరో ఎన్టీఆర్ మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
గతంలో యమదొంగ సినిమాలో యముడిగా నటించి అద్భుతమైన అభినయంతో తారక్ ఆకట్టుకున్నారు. రేపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ పుట్టినరోజు వేడుకలు ఒకింత గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న వార్2 సినిమాకు సంబంధించి కూడా క్రేజి అప్ డేట్ రానుంది. ఈ సినిమాకు సంబంధించి తారక్ రోల్ విషయంలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.
 
ఆ సందేహాలన్నీ పటాపంచలు చేసేలా వార్2 మూవీ అప్ డేట్ ఉండబోతుందని తెలుస్తోంది. వార్2 సినిమా తారక్ కెరీర్ లో మెమరబుల్ సినిమా అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయాన్ ముఖర్జీ ఒకింత భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. వార్2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తున్నారని సమాచారం అందుతోంది.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుండగా ఆ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. డ్రాగన్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లానింగ్ ఉంది. తారక్ సినిమాల మార్కెట్ అంచనాలకు మించి పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల హీరోయిన్ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్2 సినిమాలో కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ కాగా తారక్ కు జోడీగా మరో హీరోయిన్ ఉందో లేదో తెలియాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: