ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఊర్వశి కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలోను నటించింది. ఎంతోమంది పెద్దపెద్ద హీరోల సినిమాలలోనూ హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా అనేక సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఊర్వశి రౌతేలకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. 

తన నటన, అందం, అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. ఇక ఊర్వశి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. సమయం దొరికినప్పుడల్లా వారితో ముచ్చటిస్తూ సమయాన్ని గడుపుతుంది. ఇదిలా ఉండగా..... ప్రస్తుతం ఊర్వశికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలలో ఊర్వశి బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి చాలా అందంగా ముస్తాబయింది. 


ఈవెంట్ కి పాల్గొన్న సమయంలో ఊర్వశి కుందనపు బొమ్మల రెడీ అయింది. కానీ తన చేతి వద్ద డ్రెస్ కాస్త చినిగింది. అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఆ డ్రెస్ వేసుకొని ఊర్వసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉన్న సమయంలో ఆ డ్రెస్ చినిగిన ప్రదేశం వద్ద చర్మం చాలా క్లియర్ గా కనిపించింది. దీనిని చూసి చాలామంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఊర్వశి చినిగిన బట్టలు వేసుకొని మరో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని అనుకుంటుందేమో అందుకే ఇలా దుస్తులు వేసుకుందని కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది తాను చూసుకోకుండా అలా ఉందని అంటున్నారు. దీనిపైన ఊర్వశి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: