తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కమిడియన్లలో సప్తగిరి ఒకరు. ఈయన ప్రేమ కథ చిత్రం సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో కమెడియన్ పాత్రలు వచ్చాయి. అందులో భాగంగా ఈయన ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి సినిమాలను కూడా విజయం వైపు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మాత్రం సప్తగిరి ఎక్కువ శాతం సినిమాల్లో కమెడియన్ పాత్రలలో నటించడం లేదు. ఇప్పటికే సప్తగిరి సినిమాల్లో కమీడియన్ పాత్రల్లో మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి.

హీరో గా మాత్రం సప్తగిరి కి మంచి విజయాలు దక్కలేదు. తాజాగా సప్తగిరి "పెళ్లికాని ప్రసాద్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే సప్తగిరి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న ఓ దర్శకుడికి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ కానీ ఆయన దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమాలో కూడా ఆయన నటించలేదు. ఇంతకు సప్తగిరికి క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా ..? ఆయన మరెవరో కాదు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... సప్తగిరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ ఆయన ఇప్పటివరకు నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా లేడు. దానికి కారణం ... నా సినిమాలో చాలా పెద్ద పాత్ర ఉండి , దానికి మంచి ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో నటిస్తాను అని సప్తగిరి చెప్పాడు. నాకు ఇప్పటివరకు అంత గొప్ప పాత్ర సప్తగిరికి రాయలేకపోయాను. అందుకే సప్తగిరి నా సినిమాలో లేడు అని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: