టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారు నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రష్మిక మందన ఒకరు. రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకోని సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్, బాలీవుడ్ లో ఫుల్ జోరు మీద తన హవాను కొనసాగిస్తోంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. 

తెలుగు, హిందీలో ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తోంది. తనదైన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. తాను నటించే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న హీరోయిన్లలో రష్మిక ఒకరని చెప్పవచ్చు. రష్మిక చేతిలో ఐదు ఆరు సినిమాలకు పైనే ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో బిజీగా ఉంటున్న వేళ మరో సినిమాలో తనకు అవకాశం వచ్చింది. అది కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో రావడం విశేషం.

ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని రష్మిక అందుకుంది. ఇందులో మొదట రష్మికను కాకుండా బాలీవుడ్ నటి దీపిక పదుకొనెను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల దీపికను తొలగించి నటి రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో రష్మికను ఎంతో ఇష్టంగా సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేశారట. ఈ సినిమాను దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: