
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా అప్పట్లో పెద్ద సెన్సేషన్. థియేటర్లలో ఈ సినిమా అనుకున్నట్టుగా సక్సెస్ కాకపోయినా బుల్లితెరపై ఎక్కువసార్లు ప్రసారమైన సినిమాగా రికార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఈ నెల 30న ఖలేజా సినిమా మరోసారి రీ రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా టీం ట్రైలర్ విడుదల చేసింది. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అతడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ - కామెడీ - ఫాంటసీ కలగలిపి తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. టైటిల్ వివాదాలతో మహేష్ ఖలేజా పేరుతో 2010లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
మహేష్ బాబు అభిమానులు ఊహించిన దానికి కథ భిన్నంగా ఉండడంతో పాటు ఈ సినిమాకి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ బృందావనం - రజనీకాంత్ రోబో సినిమాలు రావడంతో ఖలేజా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. తర్వాత రోజుల్లో ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో మహేష్ బాబును ఎప్పుడూ చూడని కామెడీ యాంగిల్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక రీ రిలీజ్ ట్రైలర్ అయితే బాగా వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు