సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవి నిజం కాదు అని తెలిసినా కూడా సరే ఆ వార్తలు ట్రెండ్ అవుతూ ఉండడం ఫాన్స్ కి కొన్నిసార్లు ఇబ్బందికర సిచువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుష్క - ప్రభాస్ ప్రేమాయణం వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారా..?  పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ..? అనే విషయాలపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఎక్కడ లేదు. కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని .. కచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని రెబెల్ అభిమానులతో పాటు చాలామంది జనాలు నమ్మేస్తున్నారు.  అదే బలంగా ఫిక్స్ అయ్యారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి .

కానీ వీరిద్దరు మాత్రం మేము ప్రేమించుకుంటున్నామని అస్సలు చెప్పుకోవడం లేదు. కాగా అదే విధంగా గతంలో మంచు విష్ణుకు సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అయింది . బాగా వైరల్ అయింది . ఆయన ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా ఆ వార్త ట్రెండ్ అవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. హీరోయిన్ జెనీలియా ను మంచు విష్ణు ప్రేమించాడు అని అదే మూమెంట్లో ''డీ ''సినిమా షూటింగ్ టైంలో డైరెక్ట్ గా ఆమెకు ముద్దు పెట్టాలని చూసాడు అని.. ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.  దీనిపై ఎన్నో ఇంటర్వ్యూలలో మంచు విష్ణును హోస్ట్ లు డైరెక్టర్ గానే ప్రశ్నించారు .

అయితే అది ఏది కావాలి అని జరిగింది కాదు అని .. బై ఫ్లోలో అలా జరగబోయింది అంటూ కొంతమంది మంచు ఫ్యాన్స్ రియాక్ట్ అయి  ఇష్యూని అక్కడితో క్లియర్ చేశారు . కానీ అప్పట్లో ఎక్కువ మంది జనాలు మాత్రం మంచు విష్ణు ని డీప్ గా హీరోయిన్ జెనీలియాని ప్రేమించాడు అని .. జెనీలియాకు ప్రపోజ్ కూడా చేశాడు అని .. కానీ అప్పటికే జెనీలియా హీరో రితేష్ దేష్ ముక్ తో రిలేషన్ షిప్ లో ఉండింది అని .. ఆ కారణంగానే మంచు విష్ణుని రిజెక్ట్ చేసింది అని అంత మాట్లాడుకున్నారు.  అయితే ఆ విషయాలు తెలిసి కూడా మంచు విష్ణు సినిమా సీన్ లో భాగంగా ఆమెకు ముద్దు పెట్టే సన్నివేశం టైం లో డైరెక్ట్ గానే ముద్దు పెట్టాలని చూసాడు అని హీరోయిన్ జెనీలియా కోపంతో ఆయనను తోసేసింది అంటూ నానా రకాల వార్తలు వైరల్ అయ్యాయి .

అంతేకాదు అప్పట్లో చాలామంది మంచు హేటర్స్ కూడా ఈ ఇష్యుని పెద్ద రాద్ధాంతంగా చేసి పదే పదే చర్చించుకుంటూ వచ్చారు . అంతేకాదు అప్పట్లో చాలా మీడియా ఛానల్స్ లో "అన్ని కలిసి వచ్చి ఉంటే జెనీలియా మంచు మోహన్ బాబు ఇంటికి కోడలు అయ్యుండేది " అంటూ కూడా వార్తలు రాసుకొచ్చారు . కాగా ఇప్పుడు మంచు ఫ్యామిలీ లో ఎలాంటి సిచువేషన్ ఉందో అందరికీ తెలిసిందే.  విష్ణుకి మనోజ్ కి అస్సలు పడడం లేదు . ఇలాంటి మూమెంట్లోనే కొంతమంది మంచు విష్ణు కెరియర్ డ్యామేజ్ చేయడానికి ఈ విధంగా గత తాలూకా జ్ఞాపకాల వార్తలను మరొకసారి వైరల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: