ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ మూవీలో మొదట దీపికా పదుకొనేకు ఛాన్స్ దక్కగా కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీసినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపికా పదుకొనే స్థానంలో స్పిరిట్ సినిమాలో నటించే బ్యూటీ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. యానిమల్ సినిమాలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న త్రిప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు.
 
యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి ఆ సినిమాలో గ్లామరస్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో త్రిప్తి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రభాస్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ప్రభాస్ కు జోడీగా నటించడం వల్ల త్రిప్తి దశ తిరిగినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకింత భారీ స్థాయిలో స్పిరిట్ తెరకెక్కుతోంది.
 
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తన సినీ కెరీర్ లో ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించలేదనే సంగతి తెలిసిందే. స్పిరిట్ మూవీ 9 భాషల్లో రిలీజ్ కానుందని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. వైరల్ అవుతున్న వార్త నిజమైతే స్పిరిట్ మూవీ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కు స్కోప్ ఉన్న మూవీ అని చెప్పవచ్చు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.
 
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ అడిగారని ప్రభాస్ కూడా సందీప్ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభాస్ ముందుకెళ్లనున్నారని తెలుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత ఆతృతతో ఎదురుచూస్తున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కాగా స్పిరిట్ కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. స్పిరిట్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: