
ఇదే సమయంలో అల్లు అర్జున్, అట్లీ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ తెరపైకి వస్తుంది. ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే చిత్రం కోసం దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరొక హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ నజ్రియా నజీమ్. అయితే అట్లీ మూవీలో బన్నీకి సిస్టర్ క్యారెక్టర్ లో నజ్రియా నజీమ్ కనిపించబోతోందట. ఆమె పాత్ర ఫుల్ ఎమోషనల్స్ తో నిండి ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది.
బన్నీకి సిస్టర్ గా నజ్రియా నటించనుందనే వార్తలు తెరపైకి రాగానే వద్దు బాబోయ్ అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. నజ్రియా మలయాళం నటి అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా 2013లో విడుదలైన `రాజా రాణి` చిత్రంతో ఆమె స్ట్రాంగ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత నజ్రియాను టాలీవుడ్ కు పరిచయం చేయాలని చాలామంది దర్శకులు పోటీపడ్డారు. కానీ ఆమె అందుకు మొగ్గు చూప్పలేదు.
పైగా 2015లో సిల్వర్ స్క్రీన్ నుంచి బ్రేక్ తీసుకున్న నజ్రియా.. మళ్లీ 2018లో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి మరింత సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతుంది. 2022లో `అంటే సుందరానికి` సినిమాతో ఫస్ట్ టైమ్ నజ్రియా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాకు అంగీకరించలేదు. కానీ, టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడిగా నజ్రియాను చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. అటువంటి ఆమెను ఇప్పుడు బన్నీకి ఏకంగా సిస్టర్ ను చేసేసరికి ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.