గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేయనున్నట్లు ఆ బంద్ జూన్ 1 వ తేదీన స్టార్ట్ కానునట్లు ఓ వార్త భారీగా వైరల్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తి అయింది. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశాకే బంద్ చేయాలి అనే ప్రతిపాదనలను సూచించారు అని ఓ వార్త వైరల్ అయింది.

దానితో పవన్ కళ్యాణ్ కూడా కాస్త సీరియస్ అయ్యాడు. నేను సినీ పరిశ్రమ కోసం ఎంతో చేశాను. అడిగిన సినిమాకు ధరలు పెంచాను. పాత ప్రభుత్వంల మేము అస్సలు లేవు. సినీ పరిశ్రమతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాం. అయినా ఇలా చేస్తారా ..? అని సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన కొంత మంది పెద్ద నిర్మాతలు వచ్చి పవన్ గారికి తప్పుడు వార్తలు వెళ్లాయి. అసలు బంద్ అనేదే ఉండదు అని చెప్పుకొచ్చారు. ఇకపోతే పవన్ ఇప్పుడు థియేటర్ల బంద్ విషయాన్ని పక్కన పెట్టి థియేటర్లో సినిమా చూడడానికి జనాలు చెల్లిస్తున్న డబ్బుకు వారికి కనీస వసతులు అందుతున్నాయా ..? లేదా అనే దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక థియేటర్లపై ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా థియేటర్లలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఆ తర్వాత సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ఆదేశాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లపై తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: