స్టార్ హీరో కమల్ హాసన్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఆ కార్యక్రమంలో కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి కాస్త వివాదాస్పదంగా మారాయి. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా కన్నడ సూపర్ స్టార్ శివకుమార్ హాజరయ్యారు. ఈ క్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుండే పుట్టిందని శివకుమార్ కూడా తన ఫ్యామిలీనే అని చెప్పుకొచ్చారు. దీంతో కన్నడ అభిమానులు కమల్ హాసన్ పై ఫైర్ అవుతున్నారు. అసలే కర్ణాటక వాసులకు భాష అంటే ప్రాణం. భాష కోసం ఎన్నో పోరాటాల సైతం చేశారు. అలాంటిది కమల్ చేసిన కామెంట్స్ వల్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. అలాగే థగ్ లైఫ్ సినిమాలో హీరో శింబు కూడా ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, సానియా మల్హోత్రా, జోజు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. థగ్ లైఫ్ సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ చరిత్రను చూపించే విధంగా రూపొందింది. ఇటీవలే థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

కమల్ హాసన్ సీనియర్ హీరో అయినప్పటికీ కుర్ర హీరోలకు సైతం ఇండస్ట్రీలో పోటీ ఇస్తున్నారు. నిజానికి కమల్ హాసన్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోను ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతీయుడు సినిమాలో కమలహాసన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: