
నటన అందం అభినయం ఉన్నా కూడా హీరోయిన్ కు సరైన విజయం రాలేదు .. అయితే హీరోయిన్గా చేసింది , సెకండ్ హీరోయిన్గా చేసింది అయినా కూడా ఈమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది .. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే మరి ఎవరో కాదు టాలీవుడ్ బాబు బొమ్మ ప్రణీత సుభాష్ .. ఇక తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది .. అలాగే ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఎంతగానో ఫీదా అయ్యారు . ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్గా వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది .
అలా హీరోయిన్గా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకో లేకపోయినా ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది .. అయినా కూడా అంతగ విజయం అందుకోలేదు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ విజయం అందుకుంది . కానీ అంతగా అవకాశాలు అయితే అందుకోలేదు తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో , బావ , తుమ్మెద , రభస , డైనమేట్, హలో గురు ప్రేమకోసమే , బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించింది .. అలా కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది .. అలా ఫ్యామిలీ లైఫ్ లో పిల్లలు పుట్టిన కూడా తెరగని అందంతో యువతను ఎంతగానో కవ్విస్తుంది .