బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో గరుడన్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన భైరవం మూవీ ఈరోజు రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది. గత కొంతకాలంగా సరైన సినిమా లేక వెలవెలబోతున్న థియేటర్లు ఈ సినిమా రిలీజ్ తో కళకళలాడుతున్నాయి. ఈ సినిమాకు ముగ్గురు హీరోలు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.
 
సినిమాలో ముగ్గురు హీరోలు అభినయంతో అదరగొట్టారని ఫస్ట్ హాఫ్ బాగుందని మాస్ సీన్లు ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
నాంది, ఉగ్రం సినిమాలతో హిట్లు అందుకున్న విజయ్ కనకమేడల ఈ సినిమాతో మ్యాజిక్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వారం రోజుల పాటు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఢోకా లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ కనకమేడల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం. భైరవం సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
 
సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినట్టు తెలుస్తోంది. భైరవం సినిమాలో ఆసక్తికర ట్విస్టులకు ఢోకా లేదు. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. భైరవం సినిమాతో ఆ లోటు తీరినట్టేనని చెప్పవచ్చు. ఈ నెలలో విడుదలైన హిట్3, శుభం మంచి లాభాలను అందుకోగా భైరవం కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. భైరవం సినిమా కూడా అలా మాస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.


 




మరింత సమాచారం తెలుసుకోండి: