టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాలు సక్సెస్ ఫ్లాపులతో సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉన్నారు. మొదట ప్రస్థానం అనే సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించారు. మధ్యలో కొన్ని డిజాస్టర్లు రావడంతో సక్సెస్ గ్రాఫ్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఊరి పేరు భైరవకోన, మజాకా వంటి సినిమాలతో పరవాలేదు అనిపించుకున్నారు సందీప్ కిషన్..


హీరోయిన్ రెజీనాతో కలిసి పలు సినిమాలలో నటించడంతో  గతంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పలు రకాల రూమర్స్ వినిపించాయి.  సినిమాలు చేసే సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని అది ప్రేమగా మారిందని దీంతో అప్పటినుంచి వీరు ఇప్పటికీ డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా సందీప్ కిషన్, రెజీనా విషయంపై ఓపెన్ గా మాట్లాడేశారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇల్లు కొంటున్నప్పుడు  తనకి అమౌంట్ తగ్గితే తాను అడగకుండానే రెజీనా తనకు 5 లక్షల రూపాయలు పంపించిందని తెలిపారు.


అలా సహాయం చేసిన వారిని ఎప్పుడూ తాను మర్చిపోలేదని అందుకే తను కూడా నాకు ఫ్యామిలీతో సమానమని ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తెలిపారు. ఇక రెజీనా తాను కొట్టుకున్నంతగా ఎవరు  కొట్టుకొని ఉండారంటూ సందీప్ కిషన్ తెలిపారు. మొత్తానికి తమ మీద వచ్చిన రూమర్స్ పైన రెజీనా తన స్నేహితురాలంటూ క్లారిటీ ఇచ్చారు హీరో సందీప్ కిషన్. రెజీనా కూడా ఎప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే ఆమెకు సినిమాల సక్సెస్ రేట్ కొంతమెరకు ఎక్కువగానే ఉన్నది. ఈ మధ్యకాలంలో బాషతో సంబంధం లేకుండా రెజీనా కూడా ఇతర భాషలలో హవా చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: