గద్దర్ అవార్డ్స్ ప్రకటన తర్వాత మరొకసారి మెగా వెర్సెస్ అల్లు వార్ హీట్ పెంచేసింది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీకి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి అస్సలు పడడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ట్వీట్ పెట్టి మరొకసారి బన్నీ ఫ్యాన్స్ కు మండిపోయేలా చేసింది . ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఒక్కరంటే ఒక్క మెగా కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు ప్రస్తావిస్తూ విష్ చేయకపోవడం పెద్ద హాట్ టాపిక్ గా ట్రెంద్ అవుతుంది .


ఇదే మూమెంట్లో నాగబాబు ట్విట్ చేస్తూ తన కుమార్తె కొణిదెల నిహారిక అద్భుతంగా నిర్మించిన "కమిటీ కుర్రాళ్ల" మూవీకు అవార్డు రావడం పట్ల ఫుల్ ఖుషి అయిపోతూ ప్రశంసల వర్షం కురిపించారు . ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చిత్ర బృందం కు అభినందనలు తెలియజేశారు . మెగా డాటర్ నీహారిక తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "కమిటీ కుర్రోళ్ళు" మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే . ఈ చిత్రానికి ప్రతిష్టాత్మకంగా "గద్దర్ ఉత్తమ ఫీచర్ ఫీల్ అవార్డు అందుకుంది".



దీనితో నాగబాబు ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు . "గద్దర్ గౌరవాన్ని పెంపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. ప్రఖ్యాత ప్రజా కవి శ్రీ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌" అందజేయడం ద్వారా గద్దర్ గారి గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకోవడం చాలా సంతోషకరమైన సందర్భం.  నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా అనిపించింది. అంతే కాకుండా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర దర్శకుడు యధు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును కూడా అందుకోవడం ద్వారా అతనిలో ఉన్న నైపుణ్యానికి ప్రోత్సాహం లభించినట్లైంది.

 

నేను తొలిసారిగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు "జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు" లభించడం, అదే కోవలో ఇప్పుడు నా కూతురు నిహారిక నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం సారూప్యమైన యాదృచ్చిక సంఘటన. అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, దర్శకుడు యధు వంశీ, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరున ప్రత్యేక అభినందనలు" అంటూ రాసుకొచ్చారు. అయితే ఎక్కడా కూడా ఇందులో అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకపోవడం అదేవిధంగా నిహారిక పేరును మెన్షన్ చేస్తూ ట్యాగ్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కొంతమంది మన బ్లడ్ మన బ్లడ్ బ్రదర్ .. ఆయన కూతురు కాబట్టి ఆయన పొగుడుకున్నాడు అల్లు అర్జున్ అంటే ముందు నుంచి నాగబాబుకు పడదు అంటూ మరొకసారి మెగా వెర్సెస్ అల్లు ఫాన్స్ మాటలు యుద్ధాలు చేసుకుంటున్నారు.  పరిస్థితులు చూస్తుంటే ఈ వార్ ఇప్పుడు అప్పట్లో కూల్ అయ్యేలా  కనిపించడం లేదు..!



మరింత సమాచారం తెలుసుకోండి: