
టాలీవుడ్ స్టార్ హీరోలు కావడంతో ఈమె కెరియర్ అమాంతం మార్చేస్తాయని చాలా ఆశలు పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా పర్వాలేదు అనిపించుకున్న ఇప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ మీదకి వెళ్లనే లేదు. దాదాపుగా మూడేళ్ల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ ,హరి శంకర్ కాంబినేషన్ సినిమా కావడం చేత అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీ కూడా ఈ సినిమా పైన చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తోంది.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ ఉన్నది.ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా జూన్ నుంచి కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారట. ఈ సినిమా కోసం శ్రీలీల బల్క్ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ 10 నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నది.. అలాగే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీంతో బాలీవుడ్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి తోడు ఆషికి 3 సినిమా షూటింగ్ కూడా 40% పూర్తి అయ్యింది. ఇప్పుడు ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కి బల్క్ డేట్లు ఇవ్వడంతో ఒకవైపు హిందీ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని అలాగే ఈ సినిమాని కూడా నెక్స్ట్ ఇయర్ వాలెంటైన్స్ డే కి రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసుకున్నది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. కోలీవుడ్ లో కూడా పరాశక్తి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ఉన్నారట.. ఇలా సడన్గా పవన్ కళ్యాణ్ సినిమా వల్ల సినిమా షూటింగ్లకు అష్ట కష్టాలతో వెళ్లాల్సి వస్తోంది శ్రీ లీల.