
తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైం "గద్దర్ అవార్డ్స్" ప్రకటించింది . ఈ గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ సెలెక్ట్ అయ్యాడు. దీని పట్ల చాలా మంది ప్రముఖులు ఆయన ను పొగిడేశారు. పుష్ప 2 సినిమా కోసం ఆయన పడ్డ కష్టం గుర్తు చేసుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ దీనిపై ఏ విధంగా స్పందించకపోవడంతో మెగా ఫ్యామిలీకి అల్లు ఫామిలీ కి ఇంకా గొడవలు ఏమాత్రం తగ్గలేదని .. ఆ గొడవలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి అని జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు .
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ..మెగా ఫ్యామిలీ వాట్స్ ఆప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న ఈవెంట్ అయినా అందరూ కూడా మాట్లాడుకొని ముందుగానే కాల్ షీట్స్ ఆ తేదీలకు ఫీల్ చేసుకోకుండా జాగ్రత్త పడేలా అందరూ సరదాగా మాట్లాడుకునేలా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో ఉండే వాళ్ళు అల్లు అర్జున్ - స్నేహారెడ్డిని దూరం పెట్టేస్తూ ఉండడంతో బన్నీ ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఈ విధంగా వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు అంటే ఇక మెగా ఫ్యామిలీతో నో రిలేషన్ షిప్ అనుకున్నాడు అని అంటూ బన్నీ ఫ్యాన్స్ ఘాటుగా మెగా అభిమానులకు కౌంటర్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. మరొకసారి అల్లు అర్జున్ - మెగా అభిమానుల మధ్య వార్ పీక్స్ కి చేరుకుంది..!