ఐపీఎల్ లో ఆర్సీబీ టైటిల్ విన్ కావడం కర్ణాటకకు చెందిన క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆర్సీబీ టైటిల్ నెగ్గడంతో సినీ అభిమానులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు. లైవ్ మ్యాచ్ చూసిన ప్రముఖులు ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్స్ ను ఎంతగానో ఎంజాయ్ చేశారని చేస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ను భారీ తెరపై ప్రశాంత్ నీల్ వీక్షించారు.
 
బెంగళూరు విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. ప్రశాంత్ నీల్ ఆనందంతో ఎగిరి గంతేశారు. ప్రశాంత్ నీల్ భార్య లికితా రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. లికితా రెడ్డి తన పోస్ట్ లో ఈసాలా కప్ నమ్ దు.. 18 సంవత్సరాల కల నెరవేరింది.. క్రేజీయెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్ కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అని ఆమె పేర్కొన్నారు.
 
ప్రశాంత్ నీల్ ఏపీకి చెందిన వ్యక్తి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
 
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది జూన్ నెల 25వ తేదీన విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డ్రాగన్ సినిమాకు సంబంధించిన అధికారిక అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ ఈ సినిమాలో స్లిమ్ లుక్ లో కనిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: