
హరిహర వీరమల్లు కోసం కుబేర త్యాగం చేస్తుందా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. కుబేర త్యాగం చేయకపోతే కింగ్ డమ్ మూవీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ డేట్లలో రిలీజ్ వద్దనుకుంటే జులై 18వ తేదీన ఈ సినిమా విడుదల కావాలి. జులై 11వ తేదీన ఘాటి సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఘాటి సినిమాకు సైతం క్రిష్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.
హరిహర వీరమల్లు సినిమా ఎన్నో ఇతర సినిమాలపై ప్రభావం చూపుతుండటం సంచలనం అవుతోంది. రిలీజ్ డేట్లు మారడం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏ సినిమా వాయిదా పడని విధంగా హరిహర వీరమల్లుకు జరుగుతోంది. ఈ సినిమాకు బిజినెస్ సైతం ఆశించిన స్థాయిలో జరగలేదు.
హరిహర వీరమల్లు సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా కాన్సెప్ట్ అదిరిపోయిందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగించింది. హరిహర వీరమల్లు ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వీరమల్లు ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టిస్తుందని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.