
గత వారం ఖలేజా సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. వీకెండ్ లో అదరగొట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో మాత్రం సత్తా చాటలేదు. ఈ వారం సైతం జూన్ నెల 6వ తేదీన ఢీ సినిమా రీరిలీజ్ అవుతుండగా జూన్ నెల 8వ తేదీన లక్ష్మీ నరసింహ రీరిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే సంగతి తెలిసిందే.
అయితే కొన్ని రోజుల గ్యాప్ లేకుండా జూన్ 13వ తేదీన అందాల రాక్షసి సినిమా సైతం రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సైతం ఫ్యాన్ బేస్ ఉన్నా కొన్ని వారాలు గ్యాప్ ఇచ్చి రీరిలీజ్ చేసి ఉంటే బాగుండేది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కొంత గ్యాప్ తో రీరిలీజ్ అయితే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. కొందరు నిర్మాతలు అత్యాశతో ఫ్లాప్ సినిమాలను సైతం రీరిలీజ్ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ సైతం రీరిలీజ్ సినిమాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సినిమాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలను రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలపై ఇండస్ట్రీ దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. భవిష్యత్తులో రీరిలీజ్ సినిమాలపై మరి కొందరు ఫైర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.